Homeఆంధ్రప్రదేశ్ప్రజా శ్రేయస్సుకే కూటమి అడుగులు

ప్రజా శ్రేయస్సుకే కూటమి అడుగులు

- Advertisement -
  • ఎమ్మెల్యే గొండు శంకర్
  • విశాలాంధ్ర – శ్రీకాకుళం రూరల్
  • ప్రజా శ్రేయస్సు కొరకే “కూటమిప్రభుత్వం అడుగులు వేస్తుందని, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగముగా నియోజకవర్గ రూరల్ మండలం బైరి, కరజాడ గ్రామాలలో సోమవారం పర్యటించించారు. ఇంటింటికి వెళ్లి, కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధిని వివరించి, పాలన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కొరకే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరితపిస్తారని, అందుకు అనుగుణంగానే సుపరిపాలన చేస్తున్నారన్నారు. కూటమి అంటేనే పేద ప్రజల ప్రభుత్వమని, ప్రజలకు ఏం కావాలో అదే సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నారన్నారు. అనంతరం చిన్నారులతో కాసేపు ముచ్చటించి ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకొని, గ్రామ సమస్యలను విని, సంబంధిత అధికారులకు చేరవేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష బృందం, గ్రామ టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు