విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద గల ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ చైతన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తనిఖీలునిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నెలవారి తనిఖీలో భాగంగా రావడం జరిగిందని తెలిపారు. అనంతరం అక్కడి అధికారులకు, సెక్యూరిటీ గార్లకు తగిన జాగ్రత్తలను, భద్రతను మరింత పెంచాలని సూచించడం జరిగిందన్నారు. కెమెరా వ్యవస్థ ఫైర్ సేఫ్టీ 24 గంటల పద్ధతి ఏర్పాటలను స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల భద్రతలో ఎలాంటి నిర్లక్ష్యానికి తాగు ఇవ్వకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. భద్రతా నిబంధనలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, తాసిల్దార్ సురేష్ బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చేతన్
- Advertisement -
RELATED ARTICLES


