విశాలాంధ్ర`విజయవాడ (క్రైం): విజయవాడ గుణదలలో గుర్తుతెలియని ఆగంతకుడు ఓ ఇంట్లో చొరబడి మహిళ మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. బంగారు గోలుసు, చెవిదిద్దులు అపహరించాడు. ఈ ఘటన మంగళవారం విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. విజయవాడ గుణదలకు చెందిన ప్రియదర్శిని తన కుమారుడితో కలిసి గుణదల సాయి టవర్స్‌లో నివాసముంటున్నారు. తెల్లవారుజామున 3గంటల సమయంలో గుర్తుతెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న ప్రియదర్శిని మెడపై కత్తి పెట్టి భయాభ్రాంతులకు గురి చేశాడు. మెడలోని 20గ్రాముల బంగారు గొలుసు, చెవిదిద్దులు, సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లాడు. బాధితురాలు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహిళ మెడపై కత్తి పెట్టి బంగారు గోలుసు అపహరణ
- Advertisement -
RELATED ARTICLES


