హామీలు మరచి రెడ్ బుక్ పాలన
ప్రజా చైతన్యంతో హామీల అమలు
గిద్దలూరు : అధికారం కోసం లెక్కించలేని అమలు చేయలేను హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తాను ఇచ్చిన హామీలను మరిచి అన్ని చేశానంటూ చేతులెత్తేసిన తీరుపై వైయస్ఆర్సీపీ ప్రజల్లో చేతనం తీసుకొచ్చి వారి ఒత్తిడితో చేసిన హామీలను అమలు చేయించుకునే కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమమని గిద్దలూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం రాచర్ల, గిద్దలూరు లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు మేలు చేసే హామీలు మాత్రమే ఇచ్చి వాటి అమలకు కరోనా వంటి కష్టకాలంలో సైతం ప్రజలకు మేలు జరిగేలా ఆర్థిక వనరులను సమకూర్చి సంక్షేమ పథకాలు అమలు చేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను ప్రజలకు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే ప్రజల మనుషులు మళ్లించేందుకు పాలిటిక్స్ గేమ్ ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆయన విమర్శించారు. క్యూఆర్ కోడ్ లో చంద్రబాబుకు పాలనపై అభిప్రాయాన్ని తెలపాలని ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై ఉందన్నారు.


