సింగపూర్ అభివృద్ధి భాగస్వామ్యానికి అంగీకారం
విశాలాంధ్ర దర్శి:- విజనరీ సీఎం చంద్రబాబు అనితర కృషీవలుడు ఆయన బ్రాండ్ ఇమేజ్ వల్లే సింగపూర్ తిరిగి పెట్టుబడులకు ముందుకు వచ్చిందని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వివరించారు. గత వైసిపి ప్రభుత్వ వికృత వినాశనాకర విధ్వంసకర చర్యలతో వెనుదిరిగిన సింగపూర్ భాగస్వామ్యానికి తిరిగి మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు , ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ మూడు రోజుల సింగపూర్ పర్యటన సత్ఫలితాలను ఇచ్చిందన్నారు.
పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి రంగాలలో తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం శుభ పరిణామం అదేవిధంగా రాజధాని అభివృద్ధి శరవేగంగా జరిగేందుకు అంగీకారం తెలపడం చంద్రబాబు కృషీ వలుడు అని చెప్పవచ్చని కొనియాడారు.
సింగపూర్ పర్యటనలో ఉండగానే సింగపూర్ ప్రభుత్వం అభివృద్ధి భాగస్వామ్యానికి అంగీకారం తెలుపుతూ ప్రకటన చేయడం శుభపరిణామని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో మరో ముందడుగు
- Advertisement -
RELATED ARTICLES


