పట్టించుకోని అధికారులు ప్రజా ప్రతినిధులు
సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ముదిగుబ్బలో స్థానిక పుట్టపర్తి రోడ్డులో రైల్వే గేట్ వద్ద నుంచి పాత ఊరు వరకు అక్కడక్కడ రోడ్లు దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ఆ ప్రాంతంలో సంచరించే వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కొన్ని నెలలుగా పాత ఊరికి వెళ్లే రహదారిలో అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నా
ప్రజా ప్రతినిధులు , అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ముఖ్యంగా నిత్యం జనసంచారం ఉండి వాహనాల రాకపోకలు అధికంగా ఉండే రైల్వే గేట్ ప్రాంతంలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో ఆ రహదారిలో తమ వాహనాలు ఎప్పుడు
ఏ ప్రమాదానికి గురవుతాయోనని వాహన చోధకులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపారు, కాగా ఈ రోడ్డు గుండా ముఖ్యంగా ఈ గుంతల మీదుగానే అధికారులు ప్రజాప్రతినిధులు తరచూ ప్రయాణాలు చేస్తూ ఈ రోడ్ల దుస్థితి చూస్తున్న వారు ఈ గుంతలు పూడ్చడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు, కనుక ఇప్పటికైనా రైల్వే గేట్ వద్ద నుంచి ముదిగుబ్బ పాత ఊరు వరకు ప్రమాదకరంగా ఉన్న ఈ గుంతలను తక్షణమే పూడ్చివేసి వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, లేని పక్షంలో మండలంలోని రోడ్ల దుస్థితి పై త్వరలోనే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.


