Homeజిల్లాలుఅనంతపురంక్రీడలు జీవిత పాఠాలను నేర్పుతాయి..

క్రీడలు జీవిత పాఠాలను నేర్పుతాయి..

- Advertisement -

పోటీలలో గెలుపొందిన విద్యార్థులను అభినందిస్తున్న వీసీ

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: క్రీడలు జీవిత పాఠాలను నేర్పుతాయని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య హెచ్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ఎస్ కృష్ణయ్య పేర్కొన్నారు. గురువారం జేఎన్టీయూ ఆర్యభట్టు ఆడిటోరియంలో 16 వ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరి ఆచార్య టి. నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. విద్యార్థుల శారీరక, మానసిక స్థిరత్వం, ధైర్య సాహసాలను క్రీడలు బలోపేతం చేస్తాయన్నారు. క్రీడలకు విశ్వవిద్యాలయం నిరంతరం ప్రోత్సహిస్తుందన్నారు. విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీసి సర్వతో ముఖాబి వృద్దికి కృషి చేయాలన్నారు.రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. క్రీడలతో పాటు యోగ విద్యను విద్యార్థులకు నేర్పించి.. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వాన్ని , క్రీడా పోటీలలో విశ్వవిద్యాలయ కీర్తిని ఇనుమడింప చేయాలన్నారు. ఆరోగ్య పరిరక్షణలో క్రీడలు ప్రముఖ పాత్ర ఉందన్నారు. విద్యార్థులు సమయాన్ని నిర్దేశిత క్రమశిక్షణతో వినియోగించుకుంటే ఉజ్వల వికాసాన్ని కైవసం చేసుకోగలరన్నారు.
అనంతరం 2024 – 25 సం..లో 200 మంది క్రీడాకారులు సౌత్ జోన్ , అల్ ఇండియా స్థాయి లో క్రీడాకారులు వివిధ క్రీడలలో పాల్గొని క్రీడా సర్టిఫికెటట్స్ సాధించిన విద్యార్థులను వీసీ , రిజిస్ట్రార్, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ శ్రీ బి. జోజిరెడ్డి , వ్యాయమ అధ్యాపకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు