విశాలాంధ్ర కళ్యాణదుర్గం టౌన్.. పేదల ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం ప్రజావేదికలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి సహాయనిధి కోసం, అనారోగ్యంతో బాధపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులకు గురై బాధపడుతున్న వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు పేదల కోసం ఎల్లవేళలా పనిచేస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజా వేదికలో సీనియర్ నాయకులతో కలిసి 32 మందికి గాను 32.80 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ వాల్మీకి డైరెక్టర్ వైపి రమేష్, గోళ్ళ వెంకటేశులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవి, శ్రీరాములు ధనుంజయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రాజశేఖర్,గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


