- Advertisement -
విశాలాంధ్ర- వత్సవాయి: ప్రముఖ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు దారెల్లి చిరంజీవి నేతృత్వంలో పోలంపల్లి యువత గణపతి నవరాత్రులు పురస్కరించుకొని 2000 మందికి భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు… ఈ సందర్భంగా దారెల్లి చిరంజీవి మాట్లాడుతూ…. యువత దైవభక్తి మరియు దేశభక్తితో మెలగాలని ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో మెలగాలని దైవకార్యానికి ప్రతి ఒక్కళ్ళు ముందుంటూ ఇంతటి భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు యువతను ఆయన అభినందించారు…


