Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅనాధాశ్రమంలో అల్పాహారం పంపిణీ

అనాధాశ్రమంలో అల్పాహారం పంపిణీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు అనాధాశ్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు డీకే పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా కూటమి బృందము, అభిమానులు తదితరులు కలిసి ఉదయం అల్పాహారాన్ని అక్కడ అనాధలకు పంపిణీ చేశారు. తొలుత బర్త్డే కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్థసారథి పేద ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారని, జిల్లాలోనే వారికి మంచి గుర్తింపు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివయ్య, అనిల్ కుమార్, వెంకటేష్, నారాయణస్వామి, డాబా రామాంజనేయులు, మల్కాపురం రవి, అంజి, మంత్రి సత్యన్నా టీం రామకృష్ణ, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు