సిపిఎం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం- కీర్తిశేషులు కామ్రేడ్ పోలా రామాంజనేయులు సిపిఎం పార్టీకి చేసిన సేవలు అనన్యమైనవని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్హెచ్ భాష తెలిపారు. ఈ సందర్భంగా వారు వారి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ చేనేత పరిశ్రమ కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ కార్మిక సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. చేనేత కార్మికులకు ప్రతి సంవత్సరము ఇచ్చే 24 వేల రూపాయలు అందడం కోసం గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్వయంగా కలిసి కార్మికుల సహాయ సహకారాలు అందించే విధంగా పోరాటాలు నిర్వహించిన మహనీయుడు అని వారు తెలిపారు. వారి ఆశయ సాధనాల కొరకు పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మారుతి, సిఐటియు నాయకులు రమణ , అయూబ్ ఖాన్,ఆదినారాయణ హైదర్ వలీ జెవివి జిల్లా కార్యదర్శి లోకేష్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు బాబు, ముకుందా, ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జయరాం పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి.. ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గం గుత్తి పామిడి మండలాలలోని ఐదు గ్రామాలలో సోలార్ విండ్ ఫ్లవర్ ప్లాంట్లను రెన్యూ విక్రం అనే సంస్థ ఏర్పాటు కోసం లీజు పద్ధతిలో దళారుల చేత అధికార పార్టీ నేతల బెదిరింపులతో భూసేకరణ సాగుతోందని, ఆరోపణలు వచ్చిన సందర్భంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మండల నాయకులు రైతుల పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఎమ్మెల్యే ఫోన్ లో బూతు పురాణాలు మాట్లాడడం దారుణమని తెలిపారు. ఇటువంటి ప్రజా ప్రతినిధికి ప్రభుత్వం స్పందించి ఆయన పైన కఠినమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. లేనియెడల రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్హెచ్ భాష, జెవి రమణ, అయూబ్ ఖాన్, మారుతి, వెంకట్ స్వామి తదితరులు పాల్గొన్నారు


