Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉచిత బ్యాంకింగ్ శిక్షణా కార్యక్రమం

ధర్మవరం నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉచిత బ్యాంకింగ్ శిక్షణా కార్యక్రమం

- Advertisement -

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉచిత బ్యాంకింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రోత్సాహంతో యువతకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలోని డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ సూచనలతో, సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, నంద్యాలలో ప్రత్యేక ఉచిత బ్యాంకింగ్ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అని తెలిపారు.
బ్యాంకింగ్ రంగంలో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలను కల్పించి, వారి భవిష్యత్తు ఉజ్వలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రతిపాదించారు అని తెలిపారు.ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 16వ తేదీన ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది. ఆ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 50 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, ఉద్యోగం సాధించే వరకు వారికి ఉచిత భోజన, వసతి, మరియు ప్రొఫెషనల్ శిక్షణ అందించనున్నారు అని అన్నారు.ధర్మవరం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ ద్వారా స్థానిక యువతకు ఉన్నతమైన జ్ఞానం, నైపుణ్యం, మరియు బ్యాంకింగ్ రంగంలో మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం మరియు ప్రవేశ పరీక్షలో పాల్గొనడానికి మల్లికార్జున 79982 56789, నరేంద్ర 94904 42576 నంబర్లను సంప్రదించవచ్చని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు