ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;! ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో కోర్టు సమావేశం భవన్లో రెవెన్యూ డివిజన్లోని రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో బాధ్యతతో కూడిన సేవలను అందించాలని తెలిపారు. నిర్లక్ష్యం అనేది ఉండకూడదని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడమే రెవెన్యూ అధికారుల యొక్క లక్ష్యము అని వారు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలను రెవెన్యూ డివిజన్ అధికారులు, సిబ్బంది నిర్వహించాలన్నారు. గ్రీవెన్స్ రెడ్ సెల్ సిస్టం సంబంధిత ఫిర్యాదులను సమయానికి పరిష్కరించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను వారు ఆదేశించారు. ముఖ్యమైన పనులు పరిష్కారానికి అందరూ అధికారులు ఐక్యమత్యంతో తమ వంతు కృషి చేయాలని ముఖ్యంగా సుమోటో కేసులు, కుల ధ్రువపత్రాలు, అన్నదాత సుఖీభవ, వంటి కేసులను వేగవంతంగా, త్వరితగతంగా నాణ్యతతో పరిష్కరించాలని తెలిపారు. ప్రత్యేకంగా సర్వే శాఖ పనితీరుపై ఆర్డిఓ దృష్టి సారించడంతో ఇటీవల కాలంలో రాస్తా సమస్యలు, పొలాల మధ్య బౌండరీ వివాదాలు, భూములపై ఇతర వివాదాలు ఎక్కువగా వస్తున్నందున సర్వే అధికారులు వాటిని సమయానికి నిష్పక్షపాతంగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని వారు ఆదేశించారు. ఫీల్డ్ స్థాయిలో నేరుగా పనిచేసే రెవెన్యూ అధికారులు సర్వే అధికారులు వీఆర్వోలు విలేజ్ సర్వేలు అత్యంత కీలకపాత్ర పోషించాలని తెలిపారు. అప్పుడే పనితీరుపైనే ప్రజలకు అందే సేవలు నాణ్యత ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో కతి జూన్ కుప్రా, ఏడు మండలాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదు
- Advertisement -
RELATED ARTICLES


