యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు, సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర విద్యారంగా సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 15 వ తేదీ నుండి 19 తేది వరకు నిర్వహించే రణభేరిని విజయవంతం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా కార్యదర్శి ఆర్. రామకృష్ణ నాయక్ తో కలసి ధర్మవరం యుటిఎఫ్ జోన్ ఆధ్వర్యంలో రణభేరి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయచంద్రా రెడ్డి, రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ 12వ పిఆర్సి ఊసేలేదని, నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క డి.ఏ. కూడా ఇవ్వకపోగా వేలకోట్ల ఆర్థిక బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.ఇక విద్యాశాఖలో నిరంతరం “ఆన్లైన్ – అప్లోడింగ్” అంటూ బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నారని విమర్శించారు. విద్యాశక్తి కార్యక్రమాన్ని ఒకవైపు స్వచ్ఛందం అంటూనే మరోవైపు ఖచ్చితంగా కొనసాగించాలని ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. పరీక్షల మూల్యంకనాన్ని ఉపాధ్యాయులకే పరీక్షగా మార్చేశారని విమర్శించారు. ఉమ్మడి సర్వీసెస్ సమస్యను పరిష్కరించాలని బదిలీలు, ప్రమోషన్లు పూర్తయి మూడు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులు ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారని, సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం పట్టణ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జింక హరికృష్ణ, సాయి గణేష్, యూటీఎఫ్ నాయకులు రామకృష్ణ, లక్ష్మయ్య, రాంప్రసాద్, హెచ్. రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల ఆర్థిక, విద్యారంగ సమస్యలపై యుటిఎఫ్ రణభేరిని విజయవంతం చేయండి…
- Advertisement -
RELATED ARTICLES


