విశాలాంధ్ర ధర్మవరం : నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ఆఖరిరోజు విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని కదిరిగెట్ నుండి ప్రారంభమై శివానగర్ గీతా నగర్ తేరుబజార్,అంజిమాన్ సర్కిల్, కళజ్యోతి సర్కిల్, కాలేజీ సర్కిల్,ఆర్టీసీ బస్టాండ్ కొత్తపేట, గాంధీనగర్, శాంతినగర్ ప్రాంతాలలో నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బైకు ర్యాలీ నిర్వహించడం జరిగినది ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా నేత్రదానంపై అవగాహన చేసుకుని నేత్రదానం లో భాగస్వాములై భారతదేశంలో అందత్వ నివారణకు ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు తరువాత ప్రభుత్వ ఆసుపత్రి నందు రిటైర్డ్ డాక్టర్ నరసింహులు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరేటెండ్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్ , డాక్టర్ మాధవి, డాక్టర్ విజయ, డాక్టర్ రాముడు , డాక్టర్ సత్యనిర్ధారణ్ సేవా సంఘం సభ్యుడు ఆఫ్టలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప, రోటరీ క్లబ్ సభ్యులు నేత్రదానంపై వివరించినారు ఈ కార్యక్రమంలో విశ్వదీప సేవా సంఘం అధ్యక్షులు గాజుల సురేష్ టి చంద్రశేఖర్ రెడ్డి, మాధవ,చంద్రశేఖర్ జుజారు రఘు,ప్రభాకర్ రెడ్డి ధనుంజయ ఓబులయ్య, గాజుల శేషు నాగేశం,నాగార్జున వెంకటేష్ ఆదినారాయణ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
నేత్రదానం పై అవగాహనా బైక్ ర్యాలీ
- Advertisement -
RELATED ARTICLES


