Homeఆంధ్రప్రదేశ్రైతులకు యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం

రైతులకు యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం

- Advertisement -

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు

విశాలాంధ్ర ధర్మవరం; రైతులకు యూరియా సరఫరా లో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణం నందు ఆర్డీవో కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం ఆర్డిఓ మహేష్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించకపోవడం శోచనీయమన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. అధికారంలోకి రాకముందు రైతే రాజు,రైతు లేనిదే రాజ్యము లేదని గొప్ప గొప్ప ప్రగల్బాలు పలికారని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు తుంగలో తొక్కరన్నారు.ప్రభుత్వ విధానాలతో రైతులు ప్రతి యేటా అప్పుల ఊబిలో కూరుకుపోయి కోలుకోలేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలపై దృష్టి సారించి రైతుల డిమాండ్లను తక్షణమే పరిష్కారము చేయాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లాలోని ప్రతి రైతుకు ప్రత్యామ్నాయ పంటలకు నాణ్యమైన విత్తనాలు ఉచితంగా అందించి జిల్లాకు తగినంత యూరియా రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు,స్మార్ట్ మీటర్లు బిగించే పక్రియను తక్షణం రద్దు చేయాలన్నారు.
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంతో పాటు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులు విడుదల చేయాలన్నారు.
ఎన్నికల వాగ్దానంగా ప్రకటించిన ప్రతి రైతుకు రూ. 20వేలు సాగుసాయం తక్షణం విడుదల చేయాలన్నారు.రైతు రుణ విమోచన చట్టం తెచ్చి,రైతుల రుణాలన్నింటిని ఓకే పర్యాయం మాఫీ చేయాలని,పాడి రైతులకు మద్దతు ధర కల్పించాలన్నారు.కౌలు రైతుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చి,2013 భూ సేకరణ చట్టంలో రైతు వ్యతిరేక అంశాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.భీమా రుసుం ప్రభుత్వాలే భరించి,50 సంవత్సరాలు నిండిన రైతులకు రూ.10 వేలు పెన్షన్ మంజూరు. చెయ్యాలన్నారు.నకిలీ విత్తనాలు, ఎరువులు,పురుగుమందులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రైతులతో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా,మహిళా సమైక్య లీడర్స్ లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం నాయకులు అధ్యక్షులు గోవిందరాజు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు తాజుద్దీన్, ఆదినారాయణ, మసూద్, బాబావలి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు