Homeతెలంగాణజంట జలాశయాలకు భారీగా వరద నీరు..మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

జంట జలాశయాలకు భారీగా వరద నీరు..మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

- Advertisement -

తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంది. అలాగే మూసీకి కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చింది మూసీ. జియాగూడ, పురానాఫూల్, చాదర్ ఘాట్, మూసారాంబాగ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ. ఈ క్రమంలో జియాగూడ, పురానాఫుల్ వద్ద ఆలయాలు, ధోబీ ఘాట్లు నీట మునిగాయి. భారీగా వరద నీరు చేరడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డు మార్గం మూసివేశారు.

జంట జలాశయాల ఎనిమిది గేట్లు ఎత్తివేత..

అలాగే, హిమాయత్ సాగర్ , ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంది. భారీగా వరద ప్రవాహంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఎనిమిది గేట్లు ఎత్తివేశారు. జంట జలాశయాల నుంచి 8,000 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారు. హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి.. 5, 215 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు.అలాగే ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి.. 2800 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. హిమాయత్ సాగర్‌ ఇన్ ఫ్లో 5500 క్యూసెక్కులకు చేరింది. ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 2300 క్యూసెక్కులకు చేరింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు