Homeఆంధ్రప్రదేశ్ఇసుక సరఫరా నిర్వహణ మెరుగుపరచడానికి పారదర్శకత పెంచండి..

ఇసుక సరఫరా నిర్వహణ మెరుగుపరచడానికి పారదర్శకత పెంచండి..

- Advertisement -

ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; ఇసుక సరఫరా నిర్వహణను మెరుగుపరచడానికి పారదర్శకతను పెంచడానికి స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ మహేష్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ మాట్లాడుతూ
ఇసుక సరఫరా వ్యవస్థలో అదనపు చర్యలను అమలు చేసి, సరఫరా నిర్వహణను మెరుగుపరచడం, వినియోగదారులకు సులభంగా సేవలు అందించాలని తెలిపారు. అంతేకాకుండా ఇసుక పారదర్శకతను పెంచడం , ప్రజలలో విశ్వాసాన్ని పెంచడం కోసం అవసరమైన మార్గదర్శకాలను కూడా వారు తెలియజేశారు.
సమావేశంలో గత నెలలో స్వాధీనం చేసిన ట్రాక్టర్లు/వాహనాలు, విధించిన జరిమానాల వివరాలను సమర్పించాలని తహసీల్దార్లను ఆదేశించారు. అలాగే, ఇసుక సరఫరాలో పారదర్శకత పెంచడం, సరఫరా మెరుగుపరచడం మరియు ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చించడం జరిగిందన్నారు. చర్చించారు.
ఈ సమావేశం ద్వారా ఇసుక సరఫరా వ్యవస్థను మెరుగుపరచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అమలు చేయడం కొనసాగిస్తామని, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు.

ధర్మవరం రెవెన్యూ డివిజన్లో 285.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు.. ఆర్డీవో మహేష్.
ధర్మవరం డివిజన్లో గురువారం కురిసిన వర్షపాతం లో మొత్తం 285.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరంలో 72.6 మిల్లీమీటర్లు, బత్తలపల్లి లో 28.4, తాడిమర్రిలో 52.2, ముదిగుబ్బలో 22.2, కనగానపల్లి లో 26.2, చెన్నై కొత్తపల్లిలో 35.2, రామగిరిలో 48.4 మొత్తం వెరిసి 285.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావడం జరిగిందన్నారు. అత్యధికంగా ధర్మవరం పట్టణములో 72.6 నమోదు కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు