ఎంపీడీవో గీతావాణికి వినతి
విశాలాంధ్ర, ఆస్పరి (కర్నూలు జిల్లా): రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ఉన్న అధిక పనిభారాన్ని తగ్గించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు, ఆస్పరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గీతావాణికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నీలకంఠేశ్వర సింగ్, శ్రీనివాస నాయక్, ప్రశాంత్, హేమంత్ కుమార్, షంషీర్, హర్షవర్ధన్ రెడ్డి, వరప్రసాద్, సునీత, సంగీత, మహేశ్వరి, దివ్య తేజ, నాగరాజు, మల్లికార్జున, రమేష్, రాజశేఖర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులు మాట్లాడుతూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు లేని విధంగా సచివాలయ ఉద్యోగులకు డోర్-టు-డోర్ వాలంటీర్ విధులు, వీడియో కాన్ఫరెన్స్‌లు, సెలవు రోజుల్లో బలవంతంగా విధులు నిర్వహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఈ సమస్యలతో మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. వారు తమ డిమాండ్లలో ఇంటింటి సర్వేల నుంచి విముక్తి, మాతృశాఖలకు విధుల అప్పగింత, నోషనల్ ఇంక్రిమెంట్లు, AAూ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్లు, రికార్డు అసిస్టెంట్ క్యాడర్‌ను జూనియర్ అసిస్టెంట్‌గా మార్చడం, జిల్లాల వారీగా సీనియారిటీ జాబితా విడుదల చేయాలని కోరారు.


