Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసజావుగా జరిగిన శిక్షణ తరగతులు

సజావుగా జరిగిన శిక్షణ తరగతులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ భవనంలో స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు పై రెండు రోజుల శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జరిగింది. ఇందులో ఈ శిక్షణ తరగతుల్లో ఉప ఎంపీడీవో, ఏవో తో పాటు బత్తలపల్లి, కనగానపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, ధర్మవరం మండలాల ఎంపిపిలు, సర్పంచులు పాల్గొన్నారు అని తెలిపారు.ఈ శిక్షణలో పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్యం, శుద్ధజలాలు, పర్యావరణ పరిరక్షణ వంటి లక్ష్యాలను గ్రామస్థాయిలో ఎలా అమలు చేయాలో వివరించడం జరిగిందన్నారు. గ్రామాలు మారితే దేశం మారుతుంది అన్న దృక్పథంతో, ఎల్ ఎస్ డి జి ఎస్ ద్వారా 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. ధర్మవరం డివిజన్‌లో చిన్న మార్పులు అభివృద్ధికి పునాదులు అవుతాయి అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో ఎల్ ఎస్ డి జి ఎస్ ను అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద ఈ శిక్షణా తరగతులు విజయవంతం కావడం పట్ల ఎంపీడీవో కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు