Homeజిల్లాలుశ్రీ సత్యసాయివైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సహకార్యదర్శిగా దేవరకొండ రమేష్ ఎంపిక

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సహకార్యదర్శిగా దేవరకొండ రమేష్ ఎంపిక

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : వైయస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన దేవరకొండ రమేష్ ను స్టేట్ సహకార్యదర్శిగా నియమించడం జరిగిందని అధికార పూర్వకంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా దేవరకొండ రమేష్ మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో తాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి నన్ను సహకార దర్శి పదవికి కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు రమేష్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు