Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇంచార్జ్ వద్దు శాశ్వత తహసిల్దారును ఏర్పాటు చేయండి..సిపిఐ డిమాండ్

ఇంచార్జ్ వద్దు శాశ్వత తహసిల్దారును ఏర్పాటు చేయండి..సిపిఐ డిమాండ్

- Advertisement -

విశాలాంధ్ర – చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో ఇంచార్జ్ తహసిల్దార్ వద్దు శాశ్వత తహసిల్దార్ ను ఏర్పాటు చేయాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిపిఐ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరెడ్డి డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసిల్దార్ జగన్నాథ్ కు వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంచార్జ్ తహసిల్దార్ సకాలంలో ఉండకపోవడంతో రైతులకు వన్ బీలు, అడంగల్లు, ఇన్ కంసర్టిఫికెట్లు, తదితరములు పొండాలన్న మండల వ్యాప్తంగా రైతులు పలు రకాలుగా ఇబ్బందులు పాలవుతున్నారని తెలిపారు, కావున వెంటనే సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత తహసిల్దార్ ను నియమించి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జయ చంద్రారెడ్డి, తిప్పన్న, రామచంద్ర, నరసింహప్ప పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు