Homeజిల్లాలుఅనంతపురంవిద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

- Advertisement -

విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా): విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ పవర్ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం విద్యుత్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ పవర్ జెఏసి ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు రెండవ రోజు నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కావున విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగస్తులుగా గుర్తించి విద్యుత్ సంస్థలోకి విలీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి సబ్ డివిజన్ అధికారులు, రెగ్యులర్ ఉద్యోగులు, పవర్ జాక్ నాయకులు రమణ, మంజు, పావురాల శీనయ్య, వెంకట్రామి రెడ్డి, రామాంజి, పెంచలయ్య, జిలాన్, నజీర్, బాబా, ప్రభాకర్, లచ్చి, మూర్తి తదితర కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు