విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డిసంస్కరణ సభ సందర్భంగా నెల్లూరు నగరంలోని మూలపేట కు చెందిన ఒక పేద మహిళ తన జీవన భృతి కోసం సిపిఐ జిల్లా కార్యదర్శి సంప్రదించగా ఆమె నిత్యం కూరగాయలు,పూలు, పండ్లు అమ్ముకునే విధంగా ఒక తోపుడు బండిని తయారు చేయించి దానిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య ద్వారా ఆ మహిళలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నో పోరాటాలు చేయటమే కాక ఎంతోమంది ఎర్ర సైనికులను తయారు చేసిందని ఆయన పోరాటపంథాలో నడిచి నా నాడే మనము ఆయనకు అర్పించే నిజమైన నివాళి అవుతోందని అన్నారు. పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో ఆయన వద్దకు వెళ్లిన ప్రజలకు ఆయన ఇచ్చిన అండదండలు సహాయ సహకారాలు ఈనటీ కి నల్గొండ జిల్లా ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నాయని అన్నారు అటువంటి సుధాకర్ రెడ్డి స్ఫూర్తితో ఈరోజు నెల్లూరు జిల్లా సిపిఐ కార్యదర్శి అరిగెల సాయి ఒక నిరుపేద మహిళలకు అండదండలు అందించేందుకు ముందుకు రావడం నిజంగా అభినందనీయమని అన్నారు.


