విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా ధర్మవరం పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా, సత్యన్నసేన ఆధ్వర్యంలో ధర్మవరం ఎన్డీఏ కార్యాలయం ప్రాంగణంలో ఉదయం మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు, యువతీ యువకులు, సామాజిక సేవా నిబద్ధత కలిగిన ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను రక్షించే అవకాశం లభించిందని, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు.ఈ సందర్భంగా
హరీష్ బాబు , సత్యన్నసేన ప్రతినిధులు మాట్లాడుతూ –“రక్తదానం అనేది ప్రాణదానం. మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ స్ఫూర్తితో సత్యన్నసేన చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు సమాజానికి దోహదపడుతున్నాయి అని తెలిపారు. ధర్మవరం ప్రజలు ఇంత ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయం అని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టనున్నాం” అని పేర్కొన్నారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం ధర్మవరం పట్టణంలో ఒక గొప్ప సేవా యజ్ఞంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, సత్యన్నసేన ప్రతినిధులు బాలు, విక్రమ్ పాల్గొన్నారు.
ధర్మవరం లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం
- Advertisement -
RELATED ARTICLES


