Homeజిల్లాలుఅనంతపురంభార్యను చంపి భర్త ఆత్మహత్య..

భార్యను చంపి భర్త ఆత్మహత్య..

- Advertisement -

విశాలాంధ్ర-తాడిపత్రి: భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సజ్జలదిన్నె గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు భర్త ఆంజనేయులు భార్య జోత్స్నను గొంతు నులిమి చంపి, ఆ తరువాత ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు అఖిల్ (7) అంకిత్ (5) ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి సీఐ శివగంగాధర్ రెడ్డి, ఎస్సై ధరణి బాబు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కుటుంబ కలహాలే కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు భార్యా,భర్తల మృతదేహాలను తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు