Homeజిల్లాలుఅనంతపురంకుక్కలు, పశువులు, కోతుల బెడద నుండి ప్రజలను కాపాడండి

కుక్కలు, పశువులు, కోతుల బెడద నుండి ప్రజలను కాపాడండి

- Advertisement -

గ్రామ కార్యదర్శికి విజ్ఞప్తి చేసిన సామాజిక సేవా కార్యకర్తలు

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణం లో రోజు రోజుకి అధికమవుతున్న కుక్కలు, పశువులు, కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలని ఆపద్బాంధవ ట్రస్ట్ వ్యవస్థాపకులు వేల్పుల మురళి, సామాజిక సేవా కార్యకర్తలు లెనిన్ బాబు, జమీల్ తెలిపారు. బుధవారం
స్థానిక పంచాయతీ కార్యాలయం నందు ఈఓ గౌస్ సాహెబ్ కు, ఇంచార్జి ఎంపీడీవో శంకర్ కు వారు విన్నతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణం లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న విపత్కరమైన సంఘటనల యొక్క పేపర్ కట్టింగులు, ప్రస్తుతం పలువీదులలో కుక్కలు, పశువులు, కోతుల బెడద నుండి ప్రజలు ఎదుర్కోoటున్న సమస్యలను ఫోటోలు రూపంలో సమస్యలను విన్నతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. గత అనేక రోజులుగా పట్టణం లో వివిధ ప్రాంతంలో కుక్కలు, పశువులు, కోతుల నుండి ప్రజలు అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , ముఖ్యంగా కుక్కల నుండి అనేక మంది ప్రజలు రోజు ఏదో ఒక్క కుక్క కాటుకు గురి అవుతున్నారని ఇప్పటికైనా జరుగుతున్న సంఘటనలు దృష్టి లో ఉంచుకొని వాటి పైన తగు చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందికలగకుండా చూడాలని కోరారు,

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు