- Advertisement -
-డాక్టర్ శివకృష్ణ
విశాలాంధ్ర-రాప్తాడు : మహిళల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని
డాక్టర్ శివకృష్ణ అన్నారు. గురువారం గొల్లపల్లి గ్రామంలో స్వస్థనారీ స్వసక్తి పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు వివిధ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించామన్నారు. అవసరమైన వారికి తగిన వైద్య సేవలందించేందుకు సిఫారసు చేశామన్నారు. బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సర్పంచ్ హనుమంతరెడ్డి, ఏఎన్ఎం శ్రీదేవి, ఎం.ఎల్.హెచ్.పి చంద్రకళ, ఫీల్డ్ అసిస్టెంట్ బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు.


