Homeజిల్లాలుఅనంతపురంట్రాక్టర్ల బ్యాటరీలు చోరీ

ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీ

- Advertisement -

విశాలాంధ్ర బొమ్మనహల్.. మండలంలోని నేమకల్లు గ్రామంలో ట్రాక్టర్ల బ్యాటరీలు చోరికి గురయ్యాయి. గురువారం రాత్రి 8 ట్రాక్టర్ల కు చెందిన 90,000 విలువ చేసే 8 బ్యాటరీలు చోరీ జరిగినట్లు శుక్రవారం బాధితులు తెలిపారు. బోయ బుజ్జి, బోయ ఎర్రిస్వామి, పూజారి చిన్న ఎర్రిస్వామి, బోయ రమేష్, రామాంజనేయులు తదితర ఎనిమిది మందికి చెందిన ట్రాక్టర్ల నుండి బ్యాటరీలు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళినారు. గ్రామంలో వీధి దీపాలు లేకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. బ్యాటరీల దొంగతనంపై పోలీసులకు సమాచారం అందించామని ట్రాక్టర్ యజమానులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు