Homeజిల్లాలుఅనంతపురంఎక్సైజ్ కేసులో పట్టుబడిన వాహనాల వేలం..

ఎక్సైజ్ కేసులో పట్టుబడిన వాహనాల వేలం..

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు ఎక్సైజ్ కేసులలో పట్టుబడి ప్రభుత్వానికి జప్తు అయిన 6 వాహనాలను శుక్రవారం ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్ నందు అనంతపురం అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రేవతి ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలం నందు మొత్తం 3 ద్విచక్ర వాహనాలను రూ, 15,800 మరియు జీఎస్టీ గా రూ,2,842 నకు బిడ్డర్స్ కొనుగోలు చేశారని. మరో మూడు వాహనాలు కొనుగోలుకు ఎవరూ బిడ్డింగ్ వేయలేదని ఉరవకొండ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర తెలిపారు.

పట్టుబడిన మద్యం ధ్వంసం

వివిధ కేసుల్లో పట్టుబడిన 6.6 లీటర్ల నాటుసారా, 6.8 లీటర్ల ఎన్ డిపి ఎల్ 8.1 లీటర్ల డి పి ఎల్ ను అనంతపురం అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు