యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరామ్
విశాలాంధ్ర ధర్మవరం:; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) అక్టోబర్ 5వ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడే ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధ్యక్షులు షీలా నాగేంద్ర కార్యదర్శి జయరాం కోశాధికారి వంకదారి మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్వాతి క్లినిక్ లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతినెల మొదటి ఆదివారం నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు, యువర్స్ ఫౌండేషన్ సంస్థ సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కాచర్ల హనుమంతు జ్ఞాపకార్థం భార్య కాచర్ల కోనమ్మ కుమారుడు కాచెర్ల నటరాజ్ కోడలు సౌభాగ్య వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కావున ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పట్టణంలోని గ్రామీణ ప్రాంతాలలో నీ పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటి వెలుగును ప్రసాదించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శంకు సుకుమార్ సహకార దర్శి గర్రె రమేష్ బాబు, క్యాంపు చైర్మన్ వై కే శ్రీనివాసులతోపాటు డాక్టర్ బి వి. సుబ్బారావు, పిఆర్ఓ.రాధాకృష్ణ, కోటేశ్వరరావు, చాంద్ బాషా, వార్డు కౌన్సిలర్ కేత లోకేష్, సత్రశాల మల్లికార్జున,నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి
- Advertisement -
RELATED ARTICLES


