విశాలాంధ్ర -ధర్మవరం;గుంటూరు నగరంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లో జరిగిన రాష్ట్రస్థాయి రణభేరి భారీ బహిరంగ సభ నందు ధర్మవరం పట్టణానికి కి చెందిన జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్ర రెడ్డికి ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ సాగర్, యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు ,కేసెస్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చేతుల మీదుగా ప్రత్యేక మెమెంటో తో భారీ బహిరంగ సభలో అభినందనలు జిల్లా కార్యదర్శి రామకృష్ణ నాయక్ తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుండి కర్నూలులో ప్రారంభమై 19వ తేదీ వరకు నంద్యాల జిల్లాలో డోన్ పట్టణంలో ముగింపు సభ వరకు ఐదు రోజులు పాటు ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలపై విద్యారంగ సమస్యలపై పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో జరిగిన రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషిచేసిన రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డికి వేలాది మంది కలిసిన భారీ బహిరంగ సభలో ప్రత్యేక మెమెంటోతో ప్రత్యేక అభినందనలు ,సత్కరించడం హర్షనీయమని స్థానిక జిల్లా కార్యదర్శి రామకృష్ణ నాయక్ ధర్మవరం జోన్ యుటిఎఫ్ ప్రాంత నాయకులు ఆంజనేయులు ,అమర్ నారాయణరెడ్డి, రామాంజనేయులు, సాయి గణేష్, హరి కృష్ణ,గోపాల్ రెడ్డి, శివయ్య, రాంప్రసాద్, చంద్రశేఖర్ , సురేష్, శివారెడ్డి తదితరులు ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు.
యుటిఎఫ్ రణభేరి విజయవంతం పట్ల రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డికి ప్రత్యేక అభినందనలు
- Advertisement -
RELATED ARTICLES


