Homeజిల్లాలుఅనంతపురంప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి : కిమ్స్ సవీర వైద్యులు

ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి : కిమ్స్ సవీర వైద్యులు

- Advertisement -

కిమ్స్ సవీర హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

విశాలాంధ్ర -అనంతపురం : వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు అధికమవుతున్నాయని అన్నారు కిమ్స్ సవీర సీనియర్ కార్డియాలజిస్ట్ డా. బాల కిషోర్. అంతర్జాతీయ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకొని క్లాక్ టవర్ వద్ద కిమ్స్ సవీర హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ, అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డా. సందీప్ ఎం. మాట్లాడుతూ జీవనశైలిలో భాగంగా యువత ఇంటికే పరిమితం అవుతున్నారు. ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీల ముందు కూర్చుని కాలక్షేపం చేస్తున్నారని కానీ పార్కులకు వెళ్లడం గానీ వ్యాయామాలు చేయడం లేదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వయసుతో తేడా లేకుండా పుట్టిన శిశువు నుండి పెద్దవారికి వరకు గుండె సమస్యలు వస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం తమ దినచర్యలో భాగంగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. కార్డియాలజిస్టులు డా. ప్రదీప్, డా. స్పందనలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భారతదేశంలో 30 లక్షల మంది గుండె సమస్యలతో మరణిస్తున్నారని, కావున “నివారణే చికిత్స కంటే ఉత్తమం” అని ఉద్ఘాటించారు. గుండె జబ్బుల నివారణ మరియు గుండె ఆరోగ్యంకోసం వ్యాయామం, మంచి నిద్ర మరియు ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి అని తెలిపారు.
అనంతరం కిమ్స్ సవీర రిజనల్ సీఓఓ సిద్దా రెడ్డి మాట్లాడుతూ కిమ్స్ సవీర అత్యాధునిక రెండు క్యాత్ ల్యాబ్ లు ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అతి పెద్ద కార్డియాలజీ బృందం తమ హాస్పిటల్ ఉందన్నారు. అంతర్జాతీయ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వాసుల కోసం ప్రత్యేక గుండె హెల్త్ చెకప్ ప్యాకేజీని తీసుకవచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ సవీర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు