Homeజిల్లాలుఅనంతపురంమెగా డీఎస్సీ అభ్యర్థుల ను అభినందించిన జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్

మెగా డీఎస్సీ అభ్యర్థుల ను అభినందించిన జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్

- Advertisement -

విశాలాంధ్ర-అనంతపురం: కూటమి ప్రభుత్వం 2025 సంవత్సరంలో నిర్వహించిన మెగా డీఎస్సీ నందు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అభినందనలు తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ నందు ఉచిత శిక్షణ పొంది డీఎస్సీలో అర్హత సాధించి ఉద్యోగం నియామక పత్రాన్ని తీసుకున్న అభ్యర్థులను సోమవారం రెవెన్యూ భవన్ లోని గ్రీవెన్స్ హాల్లో వారికి అభినందనలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ బి.సి.స్టడీ సర్కిల్ సంచాలకులు కుష్బూ కొఠారి అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేసి, శాలువ మరియు డైరీ తో సత్కరించారు. ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ నందు శిక్షణ తీసుకున్న వారిలో 14 మంది ఉద్యోగాలను సాధించడం జరిగింది. 1.జ్వాలాపురం అలేఖ్య (స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్), 2. పి. జ్యోతి (స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్), 3. వడ్డే ధనుంజయ (స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్), 4. సాకే వరప్రసాద్ (టీజీటీ) తో పాటు మిగతా 10 మందికి ఉద్యోగాలకు అర్హత సాధించారని ఆంధ్ర ప్రదేశ్ బి.సి.స్టడీ సర్కిల్ సంచాలకులు కుష్బూ కొఠారి తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.సి స్టడీ సర్కిల్ సిబ్బంది కోర్స్ కో ఆర్డినేటర్ పి.రవీంద్ర, అకౌంటెంట్ బి. వెంకటసుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ జయ ప్రకాష, లైబ్రేరియన్ బి. శ్రీనివాసులు, అటెండర్స్ గోపాల్, జిలాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు