Homeఆంధ్రప్రదేశ్ఎంఆర్ పాలెం లో ఘనంగా దసరా ఉత్సవాలు

ఎంఆర్ పాలెం లో ఘనంగా దసరా ఉత్సవాలు

- Advertisement -

— అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గోరంట్ల

విశాలాంధ్ర – కడియం : ఒకవైపు గ్రామ ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తూనే, మరోవైపు గ్రామ సర్పంచ్ గా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ (చంటి) పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం విజయదశమి సందర్భంగా కడియం మండలం మాధవ రాయుడుపాలెం గ్రామం లో గల, శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర శివ పంచాయతన క్షేత్రం నందు కొలువై ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి ఆలయంలో, విజయదశమి సందర్భంగా నిర్వహిస్తున్న కుంకుమ పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దసరా ఉత్సవాలలో భాగంగా రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిస్తున్న భువనేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పీటల మీద కూర్చుని కుంకుమ పూజలు ఆచరించిన సర్పంచ్ అన్నందేవుల చంటి, విజయ దంపతులకు ఆయన బావమరిది మరియు  ముమ్మిడివరం మండలం పళ్ళ వారి పాలెం గ్రామ సర్పంచ్ అయిన చిక్కం శ్రీను, వెంకట పద్మజ దంపతులు నూతన వస్త్రములను బహుకరించారు. అదేవిధంగా సర్పంచ్ అన్నందేవుల చంటి భార్య విజయ పుట్టిన రోజు కూడా ఇదేరోజు కావడంతో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామంలోని సుమారు 500 మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్,  గట్టి సుబ్బారావు, ఎంపిటిసి గొల్లపల్లి వెంకటేశ్వరరావు, శివాలయ కమిటీ చైర్మన్ అన్నందేవుల చిన్నారి, వెలుగుబంటి బులిసత్తిరాజు, అన్నందేవుల రాంబాబు, అన్నందేవుల రాజీవ్ కృష్ణ, సంగీత వెంకటేశ్వర్లు,  గాజుల సత్తిబాబు, అంకం రామకృష్ణ, అన్నందేవుల రాముడు,  వడ్డీ వెంకటేశ్వరరావు, యాల్ల దుర్గరావు, కాపుగారి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు