Homeఆంధ్రప్రదేశ్గోకులాల నిర్మాణం పాడి రైతులకు భరోసా

గోకులాల నిర్మాణం పాడి రైతులకు భరోసా

- Advertisement -

ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ 

విశాలాంధ్ర – సీతానగరం: గోకులాల నిర్మాణం పాడి రైతులకు భరోసా కలుగుతుంది అని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. మండలంలో గల కాటవరం గ్రామ పంచాయితీ పరిధిలో నూతనంగా నిర్మించబోయే  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అందు చేపట్టిన గోకులాలు షెడ్లు శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిలో భాగంగా గ్రామంలో విజయదశమి సందర్భంగా శ్రీ కనక దుర్గ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి పురస్కరించుకొని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో ముచ్చటించి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక రంగం అభివృద్ధికి, రైతు కుటుంబాల ఆర్థిక స్థితి బలోపేతానికి ఈ తరహా పథకాలు ఎంతో తోడ్పడతాయన్నారు. పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మూర్తి, ఏ పి వో సత్యవతి, ఏ పిడి రాంప్రసాద్, టీడీపీ నాయకులు చిట్టూరి రంగారావు, పోలిన కృష్ణ, గుడిపాటి శ్రీనివాస్ (బాబి),జనసేన నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, కలవచర్ల విజయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు