జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి రమ
విశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయములో వాటకుల సభ్యతమును పెంచాలని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి రమ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లోని ప్రధాన పౌర శాఖ గ్రంధాలయమును ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి పలు రికార్డులను వారు పరిశీలించారు. అదేవిధంగా పాఠకులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ, గ్రంథాలయ అభివృద్ధికి గ్రంథాలయ సిబ్బంది తప్పనిసరిగా తోడ్పాటు ఇవ్వాలని తెలిపారు. అప్పుడే పట్టణంలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి, సిబ్బంది రమణా నాయక్, రాము, తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల సభ్యత్వమును పెంచండి..
- Advertisement -
RELATED ARTICLES


