Homeఆంధ్రప్రదేశ్స్వీట్స్ తో అమ్మవారి అలంకరణ

స్వీట్స్ తో అమ్మవారి అలంకరణ

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంక (బుర్రిలంక) గ్రామ దేవతైన శ్రీ ముసలమ్మ అమ్మవారికి దీపావళిని పురస్కరించుకొని అమ్మవారికి ప్రీతికరమైన తీపి పదార్థాలతో భక్తులు 60 రకాల నైవేద్యాలు సమర్పించారు. సుమారు 200 కేజీల తీపి పదార్థాలు తో అమ్మవారిని సుందరంగా తీర్చదిద్దారు, గత 5 సంవత్సరాలుగా ఈ అలంకరణ చేస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రకటించారు. ముసలమ్మ అమ్మవారు స్వీట్స్ అలంకరణలో 24 వ తేదీ శుక్రవారం వరకు భక్తులకు దర్శనమిస్తారని, అనంతరం శుక్రవారం సాయంత్రం అష్ట మంగళ హారతులు సమర్పించిన తరువాత ఈ స్వీట్స్ ను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయినున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు