Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉల్లాస్ అక్షర ఆంధ్ర శిక్షణా కార్యక్రమం.. ఎంఈఓ రాజేశ్వరి దేవి

ఉల్లాస్ అక్షర ఆంధ్ర శిక్షణా కార్యక్రమం.. ఎంఈఓ రాజేశ్వరి దేవి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎర్రగుంట లో గల దుర్గ భవాని మండల మహిళా సమైక్య భవనంలో ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమములో వాలంటీర్ టీచర్లకు ఒకరోజు శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగిందని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో కేంద్రాల నిర్వహణ వయోజనులకు బోధించే విధానం గూర్చి వివరించడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలను వయోజన విద్యా పర్యవేక్షకులు వెంకటరమణ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. చదువుకున్న యువత సేవాభావంతో వాలంటీర్లుగా ముందుకొచ్చి ధర్మవరం మండలంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కృషి చేయాలని వారు తెలిపారు. ఏబీఎన్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ వెలుగు అన్మినేటర్, తమ పరిధిలో వాలంటీర్ల సహకారంతో మండలంలోని వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది ధర్మవరం మండలాన్ని అక్షరాస్యతలో అగ్ర భాగాల నిలవాలని తెలిపారు. అనంతరం అక్షర ఆంధ్ర వాచకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య అధ్యక్షురాలు ప్రమీల, సీసీలు, అకౌంటెంట్లు, అన్మినేటర్లు, అక్షర ఆంధ్ర వాలంటీర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు