- Advertisement -
విశాలాంధ్ర కూడేరు.. మండలపరిధిలోని పీఏబీఆర్ డ్యామ్ ను ఉరవకొండ నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం సందర్శించారు. అధికారులతో కలిసి పరిశీలించి డ్యామ్ యందు నీటి నిలువపై అధికారులతో ఆరా తీశారు. డ్యాం కట్టపై కలియతిరిగి డ్యామ్ గేట్లు వాటి నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అలాగే త్వరలో కుడికాలువకు నీరు విడిచే విధంగా త్వరలో పరిశీలిస్తున్నట్లు సూచనప్రాయంగా తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, రోళ్ళ నాగరాజు. అరవకూరు పుట్ట నరేష్ తదితరులు పాల్గొన్నారు.


