అయ్యప్ప స్వాముల పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కంబాల..
పడి పూజకు 25,000 వేలు రూపాయలు విరాళం..
విశాలాంధ్ర – కోరుకొండ : కోరుకొండ మండలం కాపవరం గ్రామంలోని రామాలయం వద్ద అయ్యప్ప స్వాముల భారీ పడి పూజ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. తొలిత అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు కంబాల శ్రీనివాసరావుని పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పడిపూజ కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు 25,000 వేలు రూపాయలు విరాళం అందజేశారు. అలాగే అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించిన పలువురు స్వాములకు 5,000 వేలు రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. మూడు నియోజకవర్గల్లో దేవాలయాల అభివృద్ధికి, విద్య, వైద్య, ఆర్ధిక పరంగా కోట్ల రూపాయల ఖర్చు చేయడం జరిగిందన్నారు. రామసేన సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు


