… ఎమ్మెల్యే నల్లమిల్లి
విశాలాంధ్ర – అనపర్తి : రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన చేస్తూ ముద్రించిన గోడపత్రికలను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేతుల మీదుగాశనివారం ఆవిష్కరించారు. విత్తును నాటి నుంచి పంటను విక్రయించి డబ్బు చేతికొచ్చే వరకు రైతుకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ జుత్తుక సూర్య కుమారి, వైస్ చైర్మన్ కోనాల వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, మల్లిడి ఆదినారాయణ రెడ్డి, జనసేన ఇన్చార్జి ప్రసాద్ రెడ్డి, ఒంటమి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


