Homeఆంధ్రప్రదేశ్వెంకటేశ్వర స్వామి ఆలయంలో

వెంకటేశ్వర స్వామి ఆలయంలో

- Advertisement -

విశాలాంధ్ర – దేవరపల్లి: దేవరపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం నుండి సుప్రభాత సేవ అభిషేకాలు నిర్వహించారు శనివారం కార్తీక మాసం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు దేవరపల్లి గ్రామానికి చెందిన చిట్లు వెంకట నాగ వరప్రసాద్ నాగమణి దంపతులు స్వామి వారికి అలంకరణ ప్రసాదానికి విరాళం అందజేశారు నాగ వరప్రసాద్ దంపతులను ఆలయ ప్రధాన అర్చకులు కేశవ ఆచార్యులు దుర్గాప్రసాద్ ఆచార్యులు ఆశీర్వచనాలు అందజేశారు సాయంత్రం చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన శ్రీ రాధా శ్యామ్ కళ్యాణ భజన మండలి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని గానామృతంతో వివరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ భజన గానామృతనీ తిలకించారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు