Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం

ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం

- Advertisement -

ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం పై చర్యలు తీసుకోండి

…..జిల్లా బిజెపి అధ్యక్షులు ఫిక్కీ నాగేంద్ర

విశాలాంధ్ర – తాళ్లపూడి : ప్రభుత్వ భూమి ని ప్రజా ప్రయోజనాలకు కాకుండా  అన్యమత ప్రచార సంఘాలకు కట్టబెడితే సహించేది లేదని జిల్లా బిజెపి అధ్యక్షులు ఫిక్కీ నాగేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధ హెచ్చరించారు. తాళ్లపూడి మండల  బిజెపి అధ్యక్షులు రామకృష్ణ పిలుపు మేరకు సోమవారం జిల్లా స్థాయి బిజెపి నాయకులు తాళ్లపూడి మండలం పోచవరం గ్రామానికి విచ్చేసారు. ఈ సందర్భం గా అన్యమతస్థులు వారి ట్రస్ట్ కోసం ఆక్రమించిన ప్రభుత్వ పోరంబోకు భూమి కొండ ప్రాంత స్థలాన్ని బిజెపి బృందం సందర్శించింది. అనంతరం వారు తాళ్లపూడి పోలీస్ స్టేషన్ కు, తహసీల్దారు కార్యాలయానికి వచ్చి అధికారులను కలిసి విషయాన్ని చర్చించారు. తాళ్లపూడి మండలం పోచవరం గ్రామం పంచాయతీ పరిధిలో ఉన్న రీ సర్వే నెంబర్ 264 కొండ  భూమిలో 25 సెంట్ల లో మతపరమైన కట్టడం కట్టడం జరగగా, ఊరికి సేవ చేస్తాను అంటే అధికారులు కొండ పొలం రెండు ఎకరాలు ట్రస్ట్ కు  ఇచ్చారని చేప్పి అక్కడ చెట్లు కొట్టి తొలగించేసారని దీనిపై గతంలో తహశీల్ధార్ కు ఓ పిర్యాదు చేశామని, మరోసారి కలిసి తక్షణ చర్యకు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. భూమి పై ఉన్న ఫిర్యాదును పరిశీలించాలని లేని పక్షం లో బిజెపి ఉద్యమం  చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో తాళ్లపూడి, కొవ్వూరు మండలాల బిజెపి నాయకులు,  ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త బొర్రా శ్రీరామ మూర్తి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు