Homeఆంధ్రప్రదేశ్ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే ముప్పిడి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే ముప్పిడి

- Advertisement -

‘ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే

విశాలాంధ్ర – కొవ్వూరు : మొంథా’ తుఫాన్ పై క్షేత్ర స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు మండలం వాడపల్లి, బంగారంపేట, మద్దూరులంక, చిగురులంక, బ్రిడ్జిపేట గ్రామాల ప్రజలను కలిసి తుఫాన్ నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు తెలియజేశారు. మరియు పునరావాస కేంద్రాలను కూటమి నాయకులతో కలిసి పర్యవేక్షించారు పునరావస కేంద్రాలలో ఏర్పాట్ల వివరాలు అడిగి అధికారులు తెలుసుకున్నారు .
ఈ సందర్బంగా శాసనసభ్యులు మాట్లాడుతూ… ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో, ఒక్క ప్రాణ నష్టం జరగకుండా, అన్ని జాగ్రత్తలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంతుందని.. తుఫాన్ తీవ్రత పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని పెనుగాలులో పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేస్తూ, విధులు నిర్వహిస్తున్న అధికారులు విధులు నిర్వహిస్తున్నారని… తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం వీలైనంత మేరకు తగ్గించేలా అన్ని చర్యలు తీసుకుంటాన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సురపనేని చిన్ని ఎంపీపీకాకర్ల నారాయుడు ఎమ్మార్వో ఎం దుర్గాప్రసాద్ రెవెన్యూ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు