Homeఆంధ్రప్రదేశ్జేగురుపాడు లో రియల్ టైమ్ వాయిస్

జేగురుపాడు లో రియల్ టైమ్ వాయిస్

- Advertisement -

జేగురుపాడు గ్రామంలో రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ వ్యవస్థ ఏర్పాటు.

విశాలాంధ్ర – కడియం : తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలం జేగురుపాడు గ్రామ సచివాలయంలో, ప్రభుత్వ జాతీయ విపత్తుల శాఖ ఆధ్వర్యంలో, ఆధునిక రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ వై సతీష్ చంద్ర స్టాలిన్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా జాతీయ విపత్తులకు సంబంధించిన హెచ్చరికలు 360 డిగ్రీల హార్న్ స్పీకర్ల ద్వారా కిలోమీటర్ పరిధిలోని ప్రజలకు రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ రూపంలో అందజేయబడతాయని, వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, తుఫానులు, వర్షాలు వంటి పరిస్థితులపై ఈ సిస్టమ్ వాయిస్ అలర్ట్స్ మరియు సైరన్‌ల రూపంలో హెచ్చరికలు ఇస్తుందని తెలిపారు. ముఖ్యంగా, ఈ పరికరం కరెంట్ అవసరం లేకుండా పనిచేసే విధంగా రూపుదిద్దుకోవడం దీని ప్రత్యేకత అన్నారు.  ‘మెంథా’ తుపాను నేపథ్యంలో ఈ వ్యవస్థ గ్రామ ప్రజలకు గంట గంటకు వాతావరణ సమాచారం అందజేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కి గ్రామస్థుల తరపున ధన్యవాదాలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు