ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిషత్ కార్యాలయంలో రెండు రోజులపాటు జరగనున్న మండల స్థాయి “స్వంత ఆదాయ వనరులుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మొదటి రోజున ఈ శిక్షణ కార్యక్రమానికి
డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జనార్దన్ రావు, ఉప మండల అభివృద్ధి అధికారి వెంకటేష్, పరిపాలనా అధికారి అబ్దుల్ నబీ హాజరయ్యారు అని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు , డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పూర్తి అవగాహన దిశలో శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అధికారులు శిక్షణలో పన్నులు, ఫీజులు సక్రమంగా వసూలు చేయడం, వసూలు వివరాలను ప్రజా ప్రదర్శన బోర్డుపై ప్రదర్శించడం ద్వారా పారదర్శకతను పాటించడం వంటి అంశాలపై సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జి, 243 హెచ్ ప్రకారం పంచాయతీలకు కల్పించిన అధికారాలు, సీసీ చార్జెస్ వంటి అంశాలపై కూడా వివరణాత్మకంగా వివరించామని తెలిపారు. .అంతేకాక, ఆర్గానిక్ కిచెన్ గార్డెన్, సోక్ పిట్స్ వంటి వినూత్న కార్యక్రమాలతో పాటు, గ్రామ స్థాయిలో పిల్లల పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కమ్యూనిటీ సెంటర్లు వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ద్వారా గ్రామ పంచాయతీల స్వంత ఆదాయ వనరులను పెంపొందించుకోవచ్చని తెలిపారు. గ్రామ పంచాయతీలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మారేందుకు స్థానిక వనరుల సమర్థ వినియోగం, ప్రణాళికా దృష్టితో ఆదాయ వనరుల పెంపు అవసరమని, అధికారులు ప్రాధాన్యతతో ఉండాలన్నారు. అదేవిధంగా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఈ అభివృద్ధి కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ద్వారా గ్రామ స్థాయి అభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని అధికారులు సూచించారు.
గ్రామ పంచాయతీల స్వంత ఆదాయ వనరులపై అవగాహన శిక్షణ ప్రారంభం..
- Advertisement -
RELATED ARTICLES


