Homeఆంధ్రప్రదేశ్నీట మునిగిన వరి పంటను పరిశీలించిన అధికారులు

నీట మునిగిన వరి పంటను పరిశీలించిన అధికారులు

- Advertisement -

కడియం ఆవలో నీట మునిగిన వరి పంటను పరిశీలించిన అధికారులు.

విశాలాంధ్ర – కడియం : మొంథా తుఫాను ప్రభావంతో కడియం మండలంలోని కడియం గ్రామ పరిధిలో సర్వే నంబర్ 455 నుంచి 695 వరకు ఉన్న ఆవ పొలాలను, నీటమునిగిన ప్రాంతాలను బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు లు పరిశీలించారు. తుఫాను తగ్గిన తరువాత, తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. చేలో నిల్వ ఉన్న నీటిని పిల్ల కాలువలు ఏర్పాటు చేసి బయటకు పంపేలా చూడాలని, పూర్తిగా పడిపోయిన కంకులను కట్టలుగా కట్టి నిలబెట్టడం ద్వారా ధాన్యం నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. మొలక రాకుండా ఉండేందుకు 5 శాతం ఉప్పు ద్రావణాన్ని కంకులపై పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ సాంకేతిక సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులకు మార్గ దర్శకత్వం అందించాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు