Homeఆంధ్రప్రదేశ్సహాయక చర్యల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు

సహాయక చర్యల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు

- Advertisement -

సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికారులు, ప్రజాప్రతినిధులు.

విశాలాంధ్ర – కడియం : మెంథా తుఫాను కారణంగా ప్రజలు ధైర్యంగా ఉండాలంటూ అధికారులు, నాయకులు భరోసా కల్పించారు. కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో ఉంటున్న నిరాశ్రయులకు ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఉపసర్పంచ్ నాని, ఎంపీడీవో రమేష్, తహసీల్దార్ సునీల్, మరియు వెలుగుబంటి యూత్ సభ్యులు భోజనాలు వడ్డించి, ఎవ్వరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. అలాగే తుఫాన్ ప్రభావం వల్ల కడియం ఆవలో నేలకొరిగిన వరి పంటలను ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్, వ్యవసాయ అధికారి, ఎంపిడిఓ, తాసీల్దార్, విఆర్ఓ, మండల బిజెపి అధ్యక్షులు బొరుసు సుబ్రహ్మణ్యం, దాసరి ముత్యం, చిక్కాల శ్రీను, గారపాటి తాతబ్బాయి తదితరులు  సందర్శించి, రైతులు ధైర్యంగా ఉండాలని కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పడు అండగా ఉంటుందని తెలిపారు. అలాగే వీరవరం గ్రామంలో ఆంజనేయస్వామి గుడి వెనుక కరెంట్ స్థంభం పడిపోయిందని తెలుసుకుని మురమండ ఎఇ రామారెడ్డి, తమ సిబ్బందితో కలిసి యుద్థ ప్రతిపాదికన పనులు చేపట్టి, కరెంట్ పోల్ నిలబెట్టారు. ఈసందర్భంగా రామారెడ్డి, పరమటి పట్టాభి, లైన్ మేన్ సుబ్రహ్మణ్యం, పంచాయతీ సెక్రటరీ  సత్తిబాబు తదితరులకు స్థానిక ప్రజలు థన్యవాదములు తెలిపారు. అదేవిధంగా దామిరెడ్డిపల్లె గ్రామం నుండి దుళ్ళ వెళ్ళే రోడ్డుమార్గంలో తుపాను ప్రభావం వల్ల చెట్టు నేలకు ఒరిగి నర్సరీ రైతులు, ప్రజలు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని తెలిసిన నర్సరీ అసోసియేషన్ సభ్యులు స్పందించి జెసిబితో తొలగించడం  జరిగింది. మరో మూడురోజుల పాటు జెసిబి లు అందుబాటులో ఉంటాయని, ఎక్కడ ఇబ్బంది ఏర్పడినా అసోసియేషన్ నెంబర్ 9491474168 లో సంప్రదించాలని, అసోసియేషన్ అధ్యక్షులు రత్నంఅయ్యప్ప తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు