Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వం ఆదుకుంటుంది ఎమ్మెల్యే బత్తుల

ప్రభుత్వం ఆదుకుంటుంది ఎమ్మెల్యే బత్తుల

- Advertisement -

మొంథా బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

– పంట నష్టాన్ని త్వరాతిగతిన అంచనా వేయాలి

-పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల

విశాలాంధ్ర – రాజానగరం : మొంథా తుఫాను బాధితు లను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుం దనీ రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామ కృష్ణ అన్నారు. మండలంలోని నరేంద్రపురం, తూర్పు గానుగూడెం,ఫరిజెల్లిపేట,మల్లంపూడి, ముక్కినాడ గ్రామాల్లో మొంథా తుఫాను ప్రభావిత కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ మరియు తన అనుచరవర్గంతో కలిసి బుధవారం పరిశీలించారు. దీనిలో భాగంగా ఆయా కేంద్రాల్లో బాధితులను స్వయంగా ఆహారం వడ్డించారు.తుఫాను బాధితులను, పంట దెబ్బతిన్న రైతులకు దైర్యాన్ని అందించారు. వివిధ గ్రామాల్లో నేలకొరిగిన వరి పంట పొలంను పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొంథా తుఫాను భారిన పడిన పంటనష్టం నష్టం అంచనాలను నియోజకవర్గ వ్యాప్తంగా త్వరాతిగతిన ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.అధికారులు,ఎన్డిఏ  కూటమి నాయకులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. నిరంతరం అప్రమత్తంగా ఉండి, శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజానగరం మండలంలో సుమారు రెండు వేల ఎకరాలు వరకు పంట నష్టం వాటిల్లినట్టు మండల వ్యవసాయ శాఖాధికారి కళ్యాణ్ సూర్య కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎం.వెంకటేశ్వర్లు,ఎంపీడీవో జె ఏ ఝాన్సీ రాణి, తహశీల్దార్ జి.అనంత లక్ష్మీ సత్యవతి దేవి, ఏఈవో నాగేశ్వరరావు,వివిధ గ్రామాల పంచాయితీ కార్యదర్శులు,ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు